Saturday, April 5, 2025

బెంగాల్ అసెంబ్లీలో ఎంఎల్ఏల బాహాబాహి

- Advertisement -
- Advertisement -

Suvendu-Adhikari

న్యూఢిల్లీ: సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్ష నేత సువేందు అధికారితో సహా ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ సోమవారం సస్పెండ్ చేశారు. సువేందు అధికారితో పాటు బిజెపి శాసనసభ్యులు దీపక్ బర్మన్, శంకర్ ఘోష్, మనోజ్ తిగ్గ, నరహరి మహతోలను ఈ ఏడాది భవిష్యత్ సమావేశాలకు స్పీకర్ సస్పెండ్ చేశారు.

దీనికి ముందు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ‘అధ్వాన్నంగా’ ఉన్నందున  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ప్రకటన చేయాలని కాషాయ పార్టీ శాసనసభ్యులు డిమాండ్ చేయడంతో అధికార టిఎంసి మరియు బిజెపి ఎమ్మెల్యేలు పరస్పరం బాహాబాహి చోటుచేసుకుని అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News