Monday, December 23, 2024

గ్రామాల్లో ఎంఎల్‌ఎ మెచ్చా విస్తృత పర్యటన

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం జగన్నాథపురం పంచాయతీ రేగులకుంట గ్రామం, ములకలపల్లి పంచాయతీ డబుల్ బెడ్ రూమ్ గృహాలు ఉన్న ప్రాంతంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, మండల నాయకులు అడపా నాగేశ్వరరావు, పర్వతనేని అమర్‌నాథ్, పువ్వాల మంగపతి, శనగపాటి సీతారాములు, నందమూరి సురేష్, పామర్తి వెంకటేశ్వరరావు, గడ్డం నతానియల్, కొండవీటి రాజారావు, పుష్పాల చందర్‌రావు, బిక్కుమళ్ళ సుదాకర్, సర్పంచ్‌లు గడ్డం భవాణి, కారం సుధీర్, బీబినేని భద్రం, యంపిటిసి శనగపాటి మెహర్మణి తదితరులతో కలిసి ప్రతివీధిలో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకొని కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజల ఆధరాభిమానాలను పొందారు. రేగులకుంట గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారులతో అట్టి సమస్యలను అక్కడనే పరిష్కరించడంతో ప్రజలు ఎంఎల్‌ఎపై పూల వర్షం కురిపించారు. రేగులకుంట గ్రామానికి బిటి రోడ్డు కావాలని గ్రామస్తులు కోరగా ముఖ్యమంత్రి కెసిఆర్ ధృష్టికి ఫోన్‌లో సమస్యను తీసుకెళ్లి తక్షణమే కోటి 58 లక్షల రూపాయిలను మంజూరు చేయించడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కొండ్రు ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ప్రసాద్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం ఎంఎల్‌ఎ రూ.15,000ల నగదును అందజేశారు. అనంతరం ములకలపల్లి డబుల్ బెడ్ రూమ్ గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎంఎల్‌ఎకు ఘనస్వాగతం పలికి తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు రోడ్లు, డైనేజీలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎంఎల్‌ఎకు వివరించగా తక్షణమే స్పందించిన ఆయన సమస్యలను పరిష్కరించమని సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News