Monday, January 20, 2025

వార్డులో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి శనివారం భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లోని భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డు ఎల్బీనగర్, మైస్ గడ్డ వార్డులో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి శనివారం సాయంత్రం సమయంలో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా తొమ్మిదవ వార్డులో పలు కాలనీలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

కాలనీ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలను ఆయా కాలనీ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తనతోపాటు మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలతో కలసి రాత్రి సమయంలో వార్డు తిరుగుతూ కొంతసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, సీసీ రోడ్డు పనులను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, గ్రాంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, ఏవి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News