Thursday, December 26, 2024

మొక్కలు నాటిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

MLAs Family planted trees in Green India challenge

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదర్ గూడ ఎమ్మెల్యేల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్ర  ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కోరుకంటి ఉజ్వల, కాలేరు పద్మ, పుట్ట శైలజ, పుష్ప, చంద్రవతి, సంగీత, కోనేరు మధులిక మంజుల, విజయ, కీర్తన, రమ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News