Friday, November 15, 2024

ఎంఎల్‌ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్

- Advertisement -
- Advertisement -

రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్
ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్
26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం
లాయర్ శ్రీనివాస్‌కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు కూడా..
నిందితులతో ప్రయాణాలపై ఆరా
ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత
అడ్వకేట్ ప్రతాప్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్‌తో పాటు మరో ముగ్గురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులుగా చేర్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ మేరకు ఎసిబి ప్రత్యేక కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఇందులో బిజెపి జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్‌ను నాలుగో నిందితుడిగా పేర్కొంది. తుషార్‌ను ఐదవ నిందితుడా చేర్చిన సిట్, కేరళ వాసి జగ్గుస్వామిని 6, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ని 7వ నిందితుడిగా చేరుస్తూ సిట్ మోమో దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌ల స్వర నమూనాపై ఫోరెన్సిక్ తన నివేదికను సిట్‌కు అందించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ కేసును విచారిస్తున్న సిట్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు రెండవ నోటీసును కూడా జారీ చేసింది.

తాజా నోటీసులో, నవంబర్ 26 లేదా నవంబర్ 28 న విచారణ కోసం సిట్ ముందు హాజరు కావాలని ఆయనను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముగ్గురు వ్యక్తులు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు స్వామీజీలపై, అక్టోబర్ 26 న నలుగురు శాసనసభ్యులలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, నిందితులు తనకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని, అందుకు ప్రతిగా శాసనసభ్యుడు టిఆర్‌ఎస్‌ని వీడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయాలని రోహిత్ రెడ్డి ఆరోపించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 41 ఎ కింద సంతోష్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు బుధవారం సిట్‌ను ఆదేశించింది. నవంబర్ 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని గతంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే, వారు దర్యాప్తు ప్యానెల్ ముందు హాజరు కాలేదు. సిట్‌కి సమన్లు పంపిన శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యారు.

MLAs Poaching Case: SIT 2nd notice to BL Santosh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News