తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు మేడిగడ్డ సందర్శనకు బయల్దేరారు. కొద్దిసేపటిక్రితం అసెంబ్లీ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే, బిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు మాత్రం మేడిగడ్డ సందర్శనకు వెళ్లలేదు. కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యేలు మాత్రమే మేడిగడ్డకు వెళ్లారు. ఈ క్రమంలో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మధ్యహాన్నం 3 గంటలకు ఎమ్మెల్యేలు బ్యారేజీ వద్దకు చేరుకొనున్నారు. దాదాపు 2 గంటల పాటు ప్రాజెక్టు సైట్ ను విజిట్ చేయనున్నారు. అక్కడే ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.