Saturday, November 16, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మహాత్ముడికి నివాళ్లు అర్పించిన ప్రజా ప్రతినిధులు

MLAs tribute Gandhi in Assembly

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొని గాంధీజీ నివాళ్లు అర్పించారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో మహాత్ముడి విగ్రహానికి గవర్నర్‌తో పాటు మంత్రులు, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జిహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అహింసా మార్గంలో రాష్ట్రం సాధించుకున్నాం: స్పీకర్
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత, విజి గౌడ్, తేరా చిన్నప్పరెడ్డి, కుర్మయ్యగారి నవీన్ కుమార్, భోగారం దయానంద్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని భారతీయులకు మహాత్మాగాంధీ 152వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలకు ఇది పవిత్రమైన రోజన్నారు. గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చినట్లుగా, కెసిఆర్ నాయకత్వంలో అహింసా మార్గంలో రాష్ట్రం సాధించుకున్నామన్నారు.. ఏడేళ్లలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ బిడ్డగా గర్వంగా చెబుతున్నానన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News