Sunday, December 22, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎల్‌సి అనంతబాబు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

MLC Anantha Babu suspended from YSR Congress Party

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎంఎల్‌సి అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, పోలీసులు సైతం సుబ్రహ్మణ్యంను ఎంఎల్‌సి హత్య చేసినట్లు నిర్థారించడంతో పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈక్రమంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లా ఎస్‌పి నుంచి నివేదిక తీసుకుని అధిష్టానానికి చేరవేసింది. కాగా పోలీసు విచారణలో ఈ నెల 19న రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎంఎల్‌సి అనంతబాబు తన కారులో ఇంటికి తీసుకెళ్లినట్లు తేలింది.

ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటా, మాటా పెరగడం ఆపై జరిగిన పెనుగులాటలో సుబ్రహ్మణ్యం ఇనుప రాడ్లపై పడిపోయినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం తలకు గాయం కావడంతో ఎంఎల్‌సి అనంతబాబు తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి అతడు చనిపోయాడు. గతంలో సుబ్రహ్మణ్యం మద్యం సేవించిన సమయంలో యాక్సిడెంట్ చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్న ఎంఎల్‌సి డ్రైవర్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఎంఎల్‌సి అనంతబాబు నిందితుడని తేలడంతో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News