Thursday, January 23, 2025

ఊరూరా చెరువుల పండగలో ఎమ్మెల్సీ

- Advertisement -
- Advertisement -

మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శేరి సుభాష్ రెడ్డి ఆ గ్రామ సర్పంచ్ సుభాష్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో గ్రామస్తులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. గ్రామదేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలను గావించి గుమ్మడికాయ కొట్టి బోనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోనాలు ఎత్తుకున్న మహిళలతో కలిసి వెయ్యి మంది గ్రామస్తులతో ఊరేగింపుగా డబ్బు చప్పులతో పెద్ద చెరువు వరకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెళ్లారు.

పోతురాజుల విన్యాసాలతో ఈ బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతున్నానని 2014కు ముందు గ్రామంలో సాగునీటికి ఎంత ఘోష ఉండేదో మన ఏటి కాలువలోకి మంజీరా నుంచి సాగునీరు రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత చెక్ డాం నిర్మించుకొని పొలాలలోకి నీళ్లు ఎలా మళ్లించుకున్నామో గమనించాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతులకు గ్రామంలోని గృహాలకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేవలం మహా నాయకుడు కేసీఆర్దే అని గతంలో ఎవరికి ఇది సాధ్యపడలేదని ఎమ్మెల్సీ తెలిపారు.

మన గృహిణుల అవసరాల కోసం తాగునీటికి ఇబ్బంది పడకూడదని మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి తాగునీటిని అందించిన ఘనత కూడా కేసీఆర్ దేనని ఎమ్మెల్సీ కొనియాడారు. ఇరిగేషన్ రంగంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి కారణంగానే మెహబూబ్ నెహర్ కెనాల్ చివరి గ్రామాలైన సర్జన, ఫరీద్పూర్ ,ముత్తాయిపల్లి, భూపతిపూర్ గ్రామాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ అన్నారు. మంజీరా నదిపై చెక్ డాములు నిర్మించి భూగర్భజలాలను పెంచడం ద్వారా రైతులకు మేలు జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు. రోని మిరుగం సమయంలో కూడా చెక్ డ్యామ్ లో జల సవ్వడి కనిపిస్తున్నదంటే దాని ఘనత మన సిఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.

సాగునీటి జలవనరులను సమృద్ధిగా అభివృద్ధి చేసి రైతులు రెండు పంటలను పండించి సంతోషంగా ఉండేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిన అని ఎమ్మెల్సీ గ్రామ ప్రజలకు తెలిపారు. సర్దన గ్రామం వరకు మెహబూబ్ నెహార్ కెనాల్ లైనింగ్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని, ఈ లైనింగ్ పనులు పూర్తయితే ఘనపూర్ లో నీళ్లు వదిలితే పోచమ్మ రాల్ వరకు ఆటంకం లేకుండా పొలాల్లోకి నీళ్లు వస్తాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతోపాటు హావేలి ఘనపూర్ ఎంపిపి శేరి నారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ గాండ్ల సుభాష్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి, ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ రెడ్డి ,ఉప సర్పంచ్ రామ్ చందర్ రావు, ఉద్యమ కళాకారుడు నాగరాజు,మెదక్ ఉమ్మడి మండల వైస్ ఎంపిపి గోపాల్ రావు,సర్దన గ్రామ వార్డు సభ్యులు,గ్రామ నాయకులు,యువజన సంఘాలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News