- Advertisement -
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాజీ సిఎం జగదీశ్ శెట్టార్, లింగాయత్ నేత లక్ష్మణ్ సవాదితోపాటు పలువురు నాయకులు ఇప్పటికే కమలానికి స్వస్తి పలకగా, మరో నాయకుడు వైదొలగుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, ఎమ్‌ఎల్‌సి అయనూర్ మంజునాథ్ తన ఎమ్‌ఎల్‌సి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలన్నదే తన లక్షమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ఏ పార్టీయో పేరు చెప్పకుండా ఒక పార్టీ తరఫున ఏప్రిల్ 20న నామినేషన్ వేస్తున్నానని వివరించారు.
- Advertisement -