Friday, December 20, 2024

కెటిఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..?

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ తప్పు చేయకపోతే గుమ్మడికాయ దొంగలాగ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ షాడో సిఎంగా పని చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బిఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చిన్న సమస్య అని ఎందుకు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగం వారి ఫోన్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు, ప్రత్యర్థుల ఫోన్‌లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. భద్రతకు ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్‌ను బిఆర్‌ఎస్ వాళ్లు రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని,

తప్పు చేసిన వారు కటకటాల్లోకి వెళ్తారని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమని, విచారణలో అన్నీ తెలుతాయన్నారు. కెటిఆర్ తొందర పడుతున్నారన్నారు. ఐపిఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని, ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. తుక్కుగూడ సభకు యువత, నిరుద్యోగులు, యువత తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణలో క్షేత్ర స్థాయికి ఎన్‌ఎస్‌యూఐ తీసుకువెళ్తుందన్నారు. ఈనె 8వ తేదీ నుంచి నియోజక వర్గ స్థాయి సభలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు రెండు నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతుందన్నది వివరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News