Monday, December 23, 2024

జీఓ 46 తెచ్చింది ఎవరు, దానిపై పిల్ వేసింది ఎవరూ?

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ బల్మూరి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ల మధ్య మాటల యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్:  జీఓ 46పై బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 46 ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నిరుద్యోగులకు మొండిచేయి చూపిందని ట్విట్టర్ వేదికగా బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు. దీనిపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ట్వీట్ వేశారు. ఏమంటున్నారో మీకు అయినా అర్థం అవుతుందా సార్! జనాలు చూస్తే నవ్విపోతారు. జీఓ 46 తెచ్చింది ఎవరు, దానిపై పిల్ వేసింది ఎవరూ? చరిత్ర మరిచారేమో, ఈ జీఓ తెచ్చింది, నిరుద్యోగులపైన రుద్దింది మీ దొర ఆధ్వర్యంలోని పాత ప్రభుత్వం. మీరే జీఓలు ఇచ్చి, మీరే పిల్ వేసి లబోదిబోమనడం తగునా! ఆ జీఓ ఇచ్చినప్పుడు మీరందరూ తాగున్నారా లేక ఇప్పుడు ఓటమి జీర్ణించుకోలేక తాగి ఇలా చేస్తున్నారా? అని బల్మూరి వెంకట్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News