Sunday, January 5, 2025

రూ.100 కోట్లు వాళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి: భూమిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోందని ఎంఎల్‌సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంఎల్‌సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కొంతమంది అక్రమార్కులకు రూ. కోట్లు సంపాదించే ఆదాయ వనరుగా మారిందని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినెలా రూ.100 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయని మండిపడ్డారు. ఎపిలో రేషన్ కార్డుల విషయంపై పున:పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపులు, రైస్ మిల్లులు, గోదాములపై నిఘా పెంచాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News