Wednesday, January 8, 2025

ఎంఎల్‌సి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఎంఎల్‌సి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న, బిఆర్‌ఎస్ తరపున రాకేష్ రెడ్డి, బిజెపి తరపున గజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. 96 టేబుళ్లపై పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికల ఓట్లను లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపులో 2800 మంది సిబ్బంది పాల్గొన్నారు. జనగామ ఎంఎల్‌ఎగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడంతో ఎంఎల్‌సికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News