నంద్యాల/హైదరాబాద్: ఏపీ ఎంఎల్ సి చల్లా భగీరథరెడ్డి(46) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. గురువారం అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
కాగా, భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన రెండో కుమారుడైన భగీరథరెడ్డికి 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. చల్లా రామకృష్ణా రెడ్డి మూడవ సంతానం చల్లా భగీరథ్ రెడ్డి. 1976 మే 28వ తేదీన జన్మించారు భగీరథరెడ్డి. ఓయూ నుంచి ఎంఎ పొలిటికల్ సైన్స్ చేశారు. భార్య చల్లా శ్రీ లక్ష్మి. భగీరథ రెడ్డికి ఇద్దరు కుమారులు.