Monday, January 20, 2025

సిఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్సీ చల్లా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో ఎమ్మెల్సీ చల్లా భేటీ అయ్యారు. ఇటీవల పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో సిఎంతో చల్లా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో చల్లా కూడా హస్తం తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలపై చల్లా, సిఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు రాయచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని, ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు,

నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చల్లా సిఎం రేవంత్‌ను కోరారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల వారికి కర్నూల్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారం, పది రోజులుగా అలంపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజేయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారని హస్తం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని పిసిసి వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News