Monday, December 23, 2024

హైవేపై కంటైనర్ ను ఢీకొట్టిన కారు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు, పిఎ మృతి

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడగా.. ఆయన పిఎ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి నెల్లూరు జిల్లాలోని కోడలూరు మండలం చంద్ర శేఖరపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైవేపై ముందు వెళ్తున్న కంటైనర్ ను వేగంగా దూసుకొచ్చిన ఎమ్మెల్సీ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి తలకి గాయం కాగా, ఆయన పిఎ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కారులో ఉన్న పలువురికి కూడా గాయాలయ్యాయి. అదే దారిలో వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. వెంటనే క్షతగాత్రులను తన కారులో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News