Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో ఎంఎల్‌సి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఎపికి చెందిన ఓ ఎంఎల్‌సి మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంఎల్‌సి మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎల్‌సి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాలేదని ప్రాథమిక సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మరణం బాధాకరం : హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్త తెలిసిన తరువాత తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రజల పక్షాన గళమెత్తే గొంతు మూగబోయిందనే ఆలోచన తన మనసును కలచివేస్తుందని తెలిపారు. సాబ్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో సాబ్జీ కుటుంబం ధైర్యంగా ఉండే శక్తిని వారికి కలుగజేయాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నానన్నారు.
ఎంఎల్‌సి షేక్ సాబ్జీ ప్రజాఉద్యమాలకు తీరని లోటు : బి.వెంకట్
ఉపాధ్యాయ ఉద్యమ నేత, యుటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ మరణం హృదయాన్ని కలిచి వేసిందని ఎఐఎడబ్లూయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సాబ్జీ మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర ఆవేదన కలిగిందని ఆ దుర్ఘటనను ఇప్పటికీ నమ్మలేకున్నానని అన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయని, ఆయన అకాల మరణం వారి కుటుంబంతో పాటు ప్రజా ఉద్యమాలకు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు తీరని లోటన్నారు. విద్యార్థి ఉద్యమం నుండి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు అనేకం ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం విడదీయ రాని బంధం కలిగి ఉందని మరణానికి పది నిమిషాలు ముందు కూడా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అంగనవాడి కార్యకర్తల ధర్నాలో పాల్గొని వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించి, మరోచోట ఉద్యమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన పోరు బాటలో రాలిన అరుణతారని అన్నారు. తుది శ్వాస వరకు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన సాబ్జీ అమరజీవని, ఆయన మృతికి వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు, యుటిఎఫ్ రాష్ట్ర కమిటీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

MLC died in a road accident

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News