Monday, December 23, 2024

నేడే ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ఎంఎల్‌ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్‌సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండింటికి విడివిడిగా ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా ఇసి విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫలితంగా మండలి ఉపఎన్నికల్లో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి.

గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు, అదే రోజు రాష్ట్ర అధికారిక గెజిట్‌లో కూడా విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 18వ తేదీ సాయంత్రం ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 29వ తేదీన ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ జరనుంది. రెండు స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు జరగుతాయి. అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. రెండు నోటిఫికేషన్లకు అనుగుణంగా విడివిడిగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. శాసనసభ్యుల బలాబలాల మేరకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరిగితే ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేట్లు అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News