నేడు నోటిఫికేషన్ మార్చి 14న ఎన్నికలు =17న కౌంటింగ్
హైదరాబాద్: మహబూబ్‌నగర్,- రంగారెడ్డి-, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు బల్దియా అధికారులు సిద్ధం అవుతున్నారు. నేడు (మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కా నుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లుకు సంబంధించి జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ సోమవారం ఎన్నికల నోడల్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క మిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ మార్చి 14న నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకుగాను 5.60 లక్షల మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 169పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా ఎల్‌బి స్టేడియంలోని ఇండోర్ స్టేడియాన్ని తాత్కాలికంగా ఎంపికచేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ ప్రియాంక అలాను నియమించామని, జిహెచ్‌ఎంసి ప్రధాన కా ర్యాలయంలోని 3వ అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారని వెల్లడించారు. ఇప్పటికే నోడల్ అధికారులు నియమించడం జరిగిందని, కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో దివ్యాంగులతో పాటు 80 ఏళ్ల నిండిన వారు, కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారి వద్దకే ఎన్నికల సిబ్బంది స్వయంగా వెళ్లి ఓట్లను వేయిస్తారని తెలిపారు.