మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మూడు ఎంఎల్‌సి స్థానాలకు పోలిం గ్ ముగిసింది. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్,రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి పో లింగ్ ప్రశాంతంగా జరిగింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జి ల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానంతో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓటర్లు త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పో లింగ్ కొనసాగింది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానానికి 65 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా, కరీంనగర్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 83.24 శాతం, నల్గొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 93.55 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఉమ్మడి మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపు గుర్రాలు ఎవరనేది మార్చి 3న తేలనుంది. ప్రస్తుతం మెదక్- నిజామాబాద్ -ఆదిలాబాద్ -కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంఎల్‌సిగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎంఎల్‌సిగా రఘోత్తమ్ రెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎంఎల్‌సిగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ మూడు ఎంఎల్‌సి ఎన్నిక ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన చేపడతారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
973 పోలింగ్ కేంద్రాలు
మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర ప్రైవేటు మేనేజ్‌మెంట్, అథారిటీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేలా యజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని అధికారులు కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు
కరీంగనర్ పట్టభద్రుల ఎన్నికల్లో పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వేర్వేరు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్‌లోని వాణీనికేతన్ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఆయా స్థానాలకు పోటీ చేసిన పలువురు అభ్యర్థులు, సంఘాల నాయకులు ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలలో ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో కలెక్టర్ ఓటు వేశారు.అలాగే నిజామాబాద్ రూరల్ ఎంఎల్‌ఎ భూపతిరెడ్డి నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిట్లంలో జుక్కల్ ఎంఎల్‌ఎ తోట లక్ష్మికాంతారావుతో పాటు జిల్లాలోని పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.