Monday, November 18, 2024

ముగిసిన నామినేషన్ల ఘట్టం

- Advertisement -
- Advertisement -

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్,
సత్యవతిరాథోడ్, జగదీశ్‌రెడ్డి

MLC Elections nomination closed

మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ- వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎం ఎల్‌సి స్థానానికి టిఆర్‌ఎస్ నేత డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖ లు చేశారు. మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, సత్యవ తి రాథోడ్, పువ్వాడ అజయ్‌లతో కలిసి నల్గొం డ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు. కాగా, పల్లా నామినేషన్ వేసే క్రమంలో నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడంతో నల్గొండ నగరం గులాబీమయమైం ది. నామినేషన్ల చివరిరోజున వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా, కొంతమంది అదనంగా మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

హైదరాబాద్ ఖమ్మం రంగారెడ్డి పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి టిఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మంగళవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వాణీదేవి తరపున హోంమంత్రి మహమూద్ అలీ, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు అందజేశారు. అదేవిధంగా టిటిడిపి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజున బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు సైతం మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
పరిశీలకుల నియామకం
రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎం ఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులను(జనరల్ అబ్జర్వర్లు) నియమించింది. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ స్థానానికి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి అడిషనల్ డైరెక్టర్ హరిప్రీత్‌సింగ్‌ను, వరంగల్ – ఖమ్మం – నల్గొండ స్థానానికి యువజన విభా గం ముఖ్యకార్యదర్శి సబ్యసాచి గోష్‌పు నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News