- Advertisement -
రాయికల్: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నేతలు ప్రచారాలతో దూసుకుపోతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ నీటి మండలి అనుమతులు లేవన్నారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన సాగర్, ఎస్ఆర్ఎస్పీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -