Wednesday, January 22, 2025

ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి హౌస్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండలంలోని పాసిగాంలో ఇథనాల్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న దృష్టా గ్రామస్తులను కలిసేందుకు వెళ్తున్న పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి ని జగిత్యాల పట్టణ సిఐ రామచందర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం హౌస్ అరెస్టు చేశారు. జీవన్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను దర్మపురిలో సిఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్  అరెస్టు చేశారు. పాసిగాం గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయవద్దంటూ పాసిగాం గ్రామంలో పాటు చుట్టు ప్రక్కల గ్రామస్తులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న గ్రామస్తులను కలిసేందుకు వెళ్తున్న ఎంఎల్‌సి జీవన్‌రెడ్డితో పాటు డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్‌లను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఎంఎల్‌సితో పాటు జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్లెపెల్లి దుర్గయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మైనారిటీ సెల్ జిల్లా నాయకులు మన్సూర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేహాల్ తదితరులను పోలీసులు జీవన్‌రెడ్డి నివాసంలో గృహ నిర్భంధం చేశారు. రైతులకు మద్దతుగా పాసిగాం గ్రామానికి వెళ్తున్న జీవన్‌రెడ్డిని గృహ నిర్భంధం చేయగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల కాంగ్రెస్ నాయకులతో కలిసి జీవన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. జీవన్‌రెడ్డికి సంఘీభావం తెలిపిన వారిలో అల్లూరి మహేందర్‌రెడ్డి, పెరుమాండ్ల సత్యనారాయణ, భజన్న, శ్రీకాంత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రిజ్వాన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News