Wednesday, January 22, 2025

అంబేడ్కర్ దూరదృషితోనే తెలంగాణ సాధ్యమైంది: జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాయికల్‌ః డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దూర దృష్టి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజల కల నేరవేరిందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యంగ దినోత్సవ వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల బలోపేతానికి రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ఈ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. నిరుపేద వర్గాలు స్వేఛ్చయుత వాతావరణంలో జీవిస్తున్నారంటే అంబేడ్కర్ చలవేనని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పాలకుల నిర్లక్షం వల్ల రాష్ట్ర ఫలాలు అందరికి అందడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, అవకాశాలు లభిస్తాయని ఆశించిన విద్యార్థులు, నిరుద్యోగులకు నిరాశే మిగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కాటిపెల్లి గంగారెడ్డి, ఎంపిటిసి కొమ్ముల రాధ ఆదిరెడ్డి, పార్టీ నాయకులు, అంబేడ్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహనికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. కాగ రాయికల్ మండలం అల్లీపూర్, కిష్టంపేట, రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యంగ దినోత్సవ వేడుకలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News