Saturday, December 28, 2024

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అబద్దపు ప్రచారం మానుకోవాలి

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: కాంగ్రెస్‌పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అధికారం కోసం నీతిమాలిన రాజకీయం చేస్తూ ఏ గడ్డైన తింటాం అనే విధంగా జీవన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి వెల్గటూర్‌లో ప్రెస్ మీట్ పెట్టి సీఎం కేసీఆర్‌పై, రాష్ట్ర సర్కార్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి పాత్రికేయుల సమాశేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు ఎన్నో చూశామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీ హాయంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ది కోసం ఏ నాయకుడు కృషి చేయలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో అక్కడింత, ఇక్కడింత పనులు చేసి బిల్లులు ఎత్తుకున్న చరిత్ర కాంగ్రెస్‌పార్టీదన్నారు. ఆనాడు పర్యవరణ అనుమతులు లేకుండా, మహరాష్ట్రతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే తమ్మడి హట్టి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టి దోచుకున్నారన్నారు.

తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు నిర్మాణం కోసం అనుమతి కోరితే 148 మీటర్ల ఎత్తు వరకైతే అలోచిస్తామని మహారాష్ట్ర లేటర్ ఇచ్చిందన్నారు. ప్రాజెక్టులో సంవత్సరానికి 150 టిఎంసీ నీళ్లు నిలువ చేస్తే తెలంగాణకు 44 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని సిడబ్లూసీ తేల్చి చెప్పిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును కడతామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం కోసమేని అన్నారు. సీఎం కేసీఆర్ మూడున్నర సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అద్బుతాన్ని ఆవిష్కరించారన్నారు. కాళ్వేరం ప్రాజెక్టు పలితమే గోదావరి నది సజీవ సాక్షమని, 45 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్లూ సగం రాష్ట్రానికి త్రాగునీరు సైతం అందిస్తున్నామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రిడిజైన్ ద్వారా ప్రతి చెరువు, కుంటలు నిండు కుండలా కనిపిస్తుంటే కాంగ్రెస్‌పార్టీ నాయకులు కండ్లులేని కబోదల్లాగా అరోపనలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్లు పలితంగా 45 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి నుండి 3 కోట్ల టన్నులకు దిగుబడి పెరిగిందన్నారు. ఏ గ్రామంలో చూసిన వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయన్నారు. రాజకీయ లబ్దికోసం జీవన్ రెడ్డి లాంటి నాయకులు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. చక్కర ప్యాక్టరీ తెరవలనడం, ఇథనాల్ ప్రాజెక్టు వద్దనడం జీవన్ రెడ్డి అబద్దాలకు నిదర్శనం అన్నారు. జీవన్ రెడ్డి తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ప్రజలకు అబద్దాలు చెప్పి, బీఆర్‌ఎస్‌పార్టీపై విషం చల్లి లబ్ది పొందడం కోసమే వాడుతున్నారన్నారు.జీవన్ రెడ్డిని తమ ముందు తరం నాయకునిగా గౌరవిస్తుంటే సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, తనను ఇష్టమొచ్చిన రీతిలో విమర్శిస్తున్నాడన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఇకనుండి సహించేది లేదని హెచ్చరించారు.

రోళ్ళవాగు ప్రాజెక్టు జీవన్‌రెడ్డి చాతకాని తనానికి నిదర్శమన్నారు. ధర్మపురి, బీర్‌పూర్ మండల ప్రజల లబ్ది చేకూర్చేందుకు రూ. 75 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టామని, రేపు మాపో ప్రారంబోత్సవానికి సిద్దంగా ఉందన్నారు. ప్రాజెక్టు పూర్త కావడం వల్ల ధర్మపురి మండలంలో 15 వేల ఎకరాలు, బీర్‌పూర్ మండలంలో 15 వేల ఎకరాల పొలాలకు సాగునీరు అందనుందన్నారు. గోదావరినిదిపై ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకుని 1లక్షా 26వేల ఎకరాలను సాగునీరు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అస్తున్న ఘనత సీఎం కేసీర్‌కే దక్కిందన్నారు. ఆర్థికంగా చితికిపోయిన దళతులను ఆదుకునేందుకే దళితబందు పథకం అమలు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే 40 వేల కుటుంబాలకు దళితబందు పథకం అందిందని, ఈ సంవత్సరం చివరినాటికి మరో లక్షాపది వేల కుటుంబాలకు దళితబందు అందిస్తామన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించడం జీవన్‌రెడ్డి లాంటి నాయకులకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, జడ్పీటీసీ అరుణ, ఎఎంసీ చైర్మన్ రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్‌లు తరల్ల కార్తిక్, యూసూప్, నాయకులు సంగి శేకర్, పెరుమల్ల ఎల్లగౌడ్, ఒడ్నాల మల్లేశం, అనంతుల లక్ష్మన్, చిలువేరి శ్యాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News