- Advertisement -
హైదరాబాద్: ఆర్నెళ్లలో భూములన్నీ అమ్ముకుని పోవడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా కనపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన 111 జీవో రద్దుపై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూసంస్కరణల చట్టం అమలు కావడం లేదని మండిపడ్డారు. ఒక్కో నేత వందల ఎకరాల భూమి కొంటున్నారని, 111 జీవో పరిధిలోని భూములు క్రయవిక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి డిమాండ్ చేశారు.
ముందుగానే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. స్థిరాస్థి వ్యాపారులు, నేతలకు లబ్ధి చేేసేందుకే 111 జీవోను రద్దు చేశారని ఆరోపించారు. జంట జలాశయాలను ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతుందో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేందుకే 111 జీవో రద్దు చేశారని, 111 జీవోపై వేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని పేర్కొన్నారు.
- Advertisement -