Saturday, December 21, 2024

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జగిత్యాల టౌన్‌ః శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం, సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టనంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విశేషంగా స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. నేరుగా అభిషేక జలముతో స్వామి వారిని అభిషేకించే విధంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షుడు గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మిదేవేందర్‌రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News