Thursday, January 23, 2025

నేడు సుప్రీంకు కవిత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉం డగా ఇడి అరెస్ట్ చేయడాన్ని ఛా లెంజ్ చేస్తూ సోమవారం ఆ మె సుప్రీంలో పిల్ వేయనున్నారు. ప్రస్తుతం కవిత ఇడి కస్టడీలో ఉండటతంతో ఆమె తరుఫున భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరుఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎంఎల్‌సి కవితను శుక్రవారం హైదరాబాద్‌లో ఇడి అరెస్ట్ చేసిన సంగతి విదితమే. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల ఇడి కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం కవిత ఇడి కస్టడీలో ఉన్నా రు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇడి ఆమెను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇడి అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని బిఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కవితపై ఇడి ప్రశ్నల వర్షం? తొలి రోజు కవిత విచారణ పూర్తి..!
అటు కవితను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇడి అధికారుల ఆదివారం తొలి రోజు కవితను విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కవిత విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. ఇక, దర్యాప్తు సందర్భంగా ఎంఎల్‌సి కవితపై ఇడి ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారు? అని ఇడి ప్రశ్నించినట్లు సమాచారం. రూ.100 కోట్లకు సంబంధించిన లావీదేవీల వివరాలను ముందు పెట్టి కవితను ప్రశ్నించారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన రూ.192 కోట్ల రూపాయలు ఏం చేశారని, ఆ డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని నిలదీసినట్లు సమాచారం. ఆమె కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి మరీ ఇడి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రశ్నల్లో కవిత కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మరికొన్నింటికి మాత్రం మౌనంగా ఉన్నారని సమాచారం. అయితే, 7 రోజుల పాటు కొనసాగనున్న విచారణ, ఈ నెల 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇడి కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో కవితను ఉంచారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులు, న్యాయవా దులను కలుసుకునే వెసులుబాటును రౌస్ అవెన్యూ న్యాయస్థానం కల్పించింది. ఇంటి నుంచి భోజనానికీ ఓకే చెప్పింది. కవితను కలుసుకు నేందుకు అనుమతి పొందిన వారిలో ఆమె భర్త అనిల్, సోదరుడు కెటి ఆర్, కుటుంబసభ్యుల్లో హరీశ్‌రావు, ప్రణీత్, ఇతర న్యాయవాదుల బృం దం పేర్లు ఉన్నాయి.
ధైర్యం చెప్పిన అనిల్, కెటిఆర్, హరీశ్
మరోవైపు ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో ఆమె భర్త అనిల్, సోదరుడు కెటిఆర్, బావ హరీశ్ రావు ఆదివారం కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్‌రావు కూడా కవితను కలిశారు.
రాత్రంతా నిద్రపోలేదట.. పుస్తకాలు చదువుతూ కవిత
కాగా, కవిత తొలి రోజు రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కొత్త ప్రదేశం కావడంతో నిద్ర పోలేదని, ఎక్కువ సేపు పుస్తకాలు చదువుతూనే ఉన్నారని వెల్లడించారు.
పలువురిని విచారించనున్న ఇడి
ఈ కేసుకు సంబంధించి పలువురిని ఇడి విచారించనుంది. కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు సెల్ ఫోన్లను ఇడి స్వాధీనం చేసుకోగా, వాటిలో రెండు ఫోన్లు కవితవి కాగా, మిగిలినవి ఆమె వ్యక్తిగత సహాయకులు వాడుతున్నట్లు సమాచారం. వారందరితో పాటు పలువురిని సోమ వారం ఇడి విచారణకు పిలిచినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News