Sunday, November 24, 2024

జడ్జీకి ఎంఎల్ సి కవిత లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అరెస్టయిన బిఆర్ఎస్ ఎంఎల్ సి కె.కవిత మంగళవారం న్యాయమూర్తికి లేఖ రాసింది. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనని అరెస్టు చేశారని ఆమె తన లేఖలో పేర్కొంది. పైగా వారు తరచూ రాజకీయ కూటములు మారుతున్నారని, తమ వాంగ్మూలాలు మార్చుకుంటున్నారని తెలిపారు. మంగళవారం ఆమె జ్యూడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడగించిన పిదప ఆమె తన నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ కేసులో తన జోక్యం లేదని, తనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి కలుగలేదని ఆమె నొక్కి చెప్పారు.

‘‘రెండేళ్లకు పైగా దర్యాప్తు చేసి విఫలమయ్యాక, ఈడి నన్ను మార్చి 15న అరెస్టు చేసింది. అది కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా. కేవలం కొందరి వాంగ్మూలాల కారణంగా నన్ను అరెస్టు చేశారు. వారు తరచూ తమ రాజకీయ కూటములు, ప్రకటనలు మార్చుకుంటున్నారు. జాతీయ ఎన్నికలు(లోక్ సభ ఎన్నికలు)కు ముందు నా అరెస్టు చేశారు’ అని ఆమె తన లేఖలో పేర్కొంది.

ఈడి దాడుల పేరిట తనను బిజెపి నాయకులు బెదిరించారని కూడా కవిత పేర్కొంది. ‘‘పార్లమెంట్ లోనే బిజెపి నాయకులు నోరు మూసుకో లేదంటే ఈడిని పంపిస్తాము అని బెదిరించారు’’అని తన లేఖలో పేర్కొన్నారు. చివరగా లేఖలో తన కుమారుడి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయని, నేను లేకపోవడం వల్ల దాని ప్రభావం నా కుమారుడిపై పడుతుందని కూడా లేఖలో పేర్కొన్నారు. తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాలని ఆమె న్యాయమూర్తిని చివర్లో కోరింది.

Letter

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News