Sunday, January 19, 2025

బిఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కసిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇక, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి జడ్పి ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి మెదక్ డిసిసి అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News