Monday, December 23, 2024

అప్పుడు నన్ను చంపేందుకు ఈటల కుట్ర: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓటమి భయంతోనే బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తున్నారని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈటెల రాజేందర్ కౌంటర్ కు కౌశిక్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్‌లో ఈటల ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఈటలను చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈటల రాజేందర్ కోసం రూ.20 కోట్లు కాదుకదా? 20 రూపాయల ఖర్చు వేస్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఈటల రాజేందర్, ఆయన భార్య జమున డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2018లో తనని చంపించేందుకు ఈటల కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. ఇటీవల తనపై రెక్కీ చేసినట్టుగా అనుమానం ఉందని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా ఈటలదే బాధ్యత అని చెప్పారు.

Also Read: గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News