Monday, December 23, 2024

మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్‌లో నిర్వహించిన పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్సీ కవితను ఆలయ అర్చకులు, బిఆర్‌ఎస్ నాయకులు పూలమాతో సత్కరించి సన్మానించారు.

బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత బిఆర్‌ఎస్ శ్రేణులతో భారీ బందోబస్తుతో మహంకాళి ఆలయానికి వచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఆదివారం హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి, పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News