- Advertisement -
జగిత్యాల : బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బండారి నరేందర్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. జగిత్యాల పట్టణం లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ నాయకులు నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా నరేందర్ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. నరేందర్ భార్య బండారి రజని కౌన్సిలర్‌గా ఉన్నారు. నరేందర్ మృతి చెందారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమం వేదిక వద్ద నరేందర్ భౌతికకాయానికి కవిత నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- Advertisement -