- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలపాటు కవితను ఈడి అధికారులు విచారించారు. ఉత్కంఠగా కొనసాగిన విచారణ అనంతరం బయటికి వచ్చిన కవిత విక్టరీ సింబల్ చూపిస్తూ కారు ఎక్కి తుగ్లక్ రోడ్డులో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి చేరుకుంది.
ఉదయం వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడి అధికారులు విచారించారు. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నాలుగు గంటల సేపు ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం పిళ్లై కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.
- Advertisement -