Friday, February 21, 2025

ఎవరిని ‘బుక్’ చేస్తారు కవితాజీ?

- Advertisement -
- Advertisement -

జీవితమంతా తెలంగాణ రాష్ట్రసాధనకోసం తపించి చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండానే 2011లో మరణించిన జయశంకర్ సార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉద్యమించాలో చెప్పారు. అంతేగాని పొరుగు రాష్ట్రంలోని మరో నాయకుడు రెడ్ బుక్ మెయింటైన్ చేయడాన్ని కాపీ కొట్టి పింక్ బుక్ మెయింటైన్ చేయమని కల్వకుంట్ల కవితకుగానీ, తెలంగాణ ఉద్యమకారులు ఎవరికీగాని కచ్చితంగా చెప్పలేదు.

పొరుగు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేం కూడా అదే పని చేస్తాం అని అందరూ అర్థం చేసుకునే విధంగా కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తల మీద గాని, నాయకుల మీద గాని ఏవైనా తప్పుడు కేసులు బనాయించిన ట్టయితే వాటికి వ్యతిరేకంగా కవితగాని, ఆ పార్టీ నాయకులుగానీ ఉద్యమం చేయడంలో న్యాయం ఉంది. ఆ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది.

ఈ బుక్కుల జోలికి పోకుండా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల మీద అక్రమంగా కేసులు పెడితే, వారిని అనవసరంగా వేధిస్తే ఊరుకోబోము, మేం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని సరిచేస్తామని చెప్పుకోవాలి కానీ బుక్కులు చూపించి బెదిరించే ధోరణి మంచిది కాదు. రాజకీయాల్లో కవితకు జయశంకర్ సార్ ఆదర్శం కావాలి, లోకేష్ కాకూడదు.

జీవితమంతా తెలంగాణ రాష్ట్రసాధనకోసం తపించి చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండానే 2011లో మరణించిన జయ శంకర్ సార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉద్యమించాలో చెప్పారు. అంతేగాని పొరుగు రాష్ట్రంలోని మరో నాయకుడు రెడ్ బుక్ మెయింటైన్ చేయడాన్ని కాపీ కొట్టి పింక్ బుక్ మెయింటైన్ చేయమని చెప్పి కల్వకుంట్ల కవితకుగానీ, తెలంగాణ ఉద్యమకారులు ఎవరికీగాని కచ్చితంగా చెప్పలేదు.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు ఏం నేర్పించారు? పింక్ బుక్ మెయింటైన్ చేయమని చెప్పారా? తెలంగాణ జాగృతి నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత మొన్న జనగామ పర్యటనలో పత్రికలవారితో మాట్లాడుతూ ఉద్యమం ఎలా చేయాలో, లెక్కలు ఎలా రాసుకోవాలో జయశంకర్ సార్ మాకు నేర్పించారు అన్నారు. జీవితమంతా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తపించి చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండానే 2011లో మరణించిన జయశంకర్ సార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉద్యమించాలో చెప్పారు. అంతేగాని పొరుగు రాష్ట్రంలోని మరో నాయకుడు రెడ్ బుక్ మెయింటైన్ చేయడాన్ని కాపీ కొట్టి పింక్ బుక్ మెయింటైన్ చేయమని చెప్పి కల్వకుంట్ల కవితకు గానీ, తెలంగాణ ఉద్యమకారులు ఎవరికీగాని కచ్చితంగా చెప్పలేదు.

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పాదయాత్ర జరిపిన సందర్భంగా ఈ రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. తాను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నానని, తన పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల పేర్లన్నీ అందులో రాసుకుంటున్నానని తాము అధికారంలోకి రాగానే వారందరి పని పడతానని ఆయన బహిరంగంగానే ప్రకటించేవారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి ముఖ్యమంత్రి కాగానే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగి ఉంటే, ఎవరి మీదైనా కక్ష సాధింపు కోసం తప్పుడు కేసులు పెట్టి ఉంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరి చేయడంలో తప్పులేదు.

అంటే అధికారంలో ఉన్న వారు చేయాల్సిన పని ఏమిటి? ఎవరిమీదైనా తప్పుడు కేసులు బనాయించి ఉంటే వాటిని ఎత్తివేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డవారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం. చేయాల్సింది ఇదయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఏమిటో చూస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. మనకో రాజ్యాంగం ఉంది. దాని ద్వారా రూపొందించుకున్న చట్టాలు ఉన్నాయి. పాలకులయినా సరే ఆ చట్టాలను అతిక్రమించడానికి వీలు లేదు. అది నేరం అవుతుంది.ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కవితగారు కూడా ఒక బుక్కును తెరిచామని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తామని కూడా అంటున్నారు. తమ పార్టీ రంగు గులాబీ కాబట్టి పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నానని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తెలుగుదేశం అధికారిక రంగు పసుపు, ఆయన ఎందుకో మరి తన పుస్తకానికి ఎర్ర రంగు ఎంచుకున్నారు.రెడ్ బుక్ అనేదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రాముఖ్యంగల అధికారిక పుస్తకాలను రెడ్ బుక్స్ అంటుంటారు. ఎరుపు రంగు అట్టవేసిన ఒక ప్రభుత్వ ప్రచురణ అని అర్థం. దీనికి ఇంకొక ఆసక్తికరమైన అర్థం కూడా ఉంది. చైనా విప్లవోద్యమ నాయకుడు మావో జెడాంగ్ కొటేషన్లు, ఫోటోలు గల ఒక పుస్తకాన్ని కూడా అక్కడ చైనాలో రెడ్ బుక్ అని పిలుచుకుంటారు. అయితే ఎరుపు అనగానే కమ్యూనిస్టుల రంగు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సాంప్రదాయవాదులు భారతదేశంలో ఎరుపు అంటే అది కమ్యూనిస్టుల రంగు, తమకు నిషేధం అని భావిస్తూ ఉంటారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలు నుదుట ధరించే కుంకుమ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ఆ నుదుటి బొట్టుకు మతాచారాల్లో ఎంతో ప్రాముఖ్యత, పవిత్రత కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన శాసనసభ ఎన్నికల

సందర్భంగా ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎర్ర రంగు అట్ట వేసిన రాజ్యాంగం కాపీని చూపిస్తూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నాయకుడు, ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ నక్సలైట్ల సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడని ఆక్షేపించారు.ఇక మళ్లీ కవిత గారి పింక్ బుక్ దగ్గరికి వచ్చినట్లయితే పొరుగు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేం కూడా అదే పని చేస్తాం అని అందరూ అర్థం చేసుకునే విధంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తల మీద గాని, నాయకుల మీద గాని ఏవైనా తప్పుడు కేసులు బనాయించినట్టయితే వాటికి వ్యతిరేకంగా కవితగాని, ఆ పార్టీ నాయకులుగానీ ఉద్యమం చేయడంలో న్యాయం ఉంది. ఆ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. భవిష్యత్తులో వారు మళ్ళీ అధికారంలోకి వస్తే అటువంటి తప్పుడు కేసులు ఏమైనా ఉంటే

ఉపసంహరించుకుని వాటికి బాధ్యులైన వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పుణ్యమా అని ఈ బుక్కుల పేరు ఎత్తగానే ప్రజలు ఇంకేదో అర్థం చేసుకుంటున్నారు. తమకు గిట్టనివారినీ, తమ రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేసే వారందరినీ వేధిస్తామని అర్థం వచ్చే విధంగా ప్రస్తుతం అక్కడి వ్యవహారశైలి నడుస్తోంది. ఇక్కడ కవిత చెప్తున్న పింక్ బుక్‌ను కూడా జనం అలానే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ బుక్కుల జోలికి పోకుండా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల మీద అక్రమంగా కేసులు పెడితే, వారిని అనవసరంగా వేధిస్తే ఊరుకోబోము, మేం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని సరిచేస్తామని చెప్పుకోవాలి కానీ బుక్కులు చూపించి బెదిరించే ధోరణి మంచిది కాదు. రాజకీయాల్లో కవితకు జయశంకర్ సార్ ఆదర్శం కావాలి, లోకేష్ కాకూడదు.

****
‘చిరు’ కోరిక న్యాయమేనా?
ప్రజలను ప్రభావితులను చేసే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బహిరంగ వేదికల మీదకు వస్తే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, ఎంత ఆచితూచి మాట్లాడాలో తెలియజెప్పే సందర్భం మరొకటి ఇక్కడ ప్రస్తావించాలి. ప్రఖ్యాత నటుడు, మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి గత వారం ఒక సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ తన వారసత్వాన్ని కొనసాగించడానికి కుమారుడు రాంచరణ్ ఒక కొడుకును కంటే బాగుండుననే కోరిక వెల్లడించారు. ‘ఇంట్లో అంతా ఆడవాళ్ళు, నేను ఆడవాళ్ళ హాస్టల్ వార్డెన్ నా? అనే భావన కలుగుతుంటుంది’ అన్నారు ఆయన. ఆడవాళ్ళ పట్ల చిరంజీవికి చులకన భావం లేకపోవచ్చు కానీ వంశానికి వారసులు మగపిల్లలే అవుతారు కాని ఆడపిల్లలు కారని ఆయన నమ్ముతున్నారనడానికి ఆ మాటలు నిదర్శనంగా నిలుస్తాయి. సహజంగానే ఆయన మీద పెద్దయెత్తున పురుషాహంకారి అనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘మా సినిమా ఫంక్షన్లలో మేం ఏమయినా మాట్లాడుకుంటాం మీకెందుకు?’

అని అనొచ్చు ఎవరయినా. ఈ మధ్యనే భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన మరో తెలుగు సినిమా ప్రముఖ నటుడు కొంతకాలం క్రితం బహిరంగ సినిమా వేదిక మీద ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి, గర్భవతిని (ఈ మాత్రం మర్యాదకరమయిన పదం కూడా వాడలేదు) అయినా చెయ్యాలి అని మాట్లాడాడు. ఆయన్ని ఎవరేమి చెయ్యగలిగారు? ఆయనకు పద్మభూషణ్, చిరంజీవిగారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే స్త్రీజాతి మీద తమకుగల గౌరవాన్ని చాటుకోడానికి ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అని ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అసలే సినిమా రంగంలో మహిళలను మర్యాదగా చూడరు, గౌరవించరు అనే అభిప్రాయం బయట ప్రపంచంలో ఉంది. అంతోఇంతో ఆ ప్రపంచంలోనుండి బయటికి తొంగి చూసి స్వల్పకాలమయినా ప్రజా జీవితం గడిపిన చిరంజీవిలాంటి వాళ్ళు యథాలాపంగానే మాట్లాడాం అన్నా కూడా వాటి ప్రభావం చాలా ఉంటుంది. బయట ఇంత చర్చ జరిగాక అయినా ఆయన బహిరంగంగా ‘ఆ ఉద్దేశంతో నేను అనలేదు’

అని సవరించుకోకపోవడం మరింత ఆక్షేపణీయం. సామాజిక మాధ్యమాల్లో తమ అసలు పేర్లు ప్రకటించడానికి కూడా ధైర్యంలేని ఆయన అభిమానులు కొందరు ‘చిరంజీవి తన నట వారసత్వం మనవడికి ఇవ్వాలనుకుంటే తప్పేమిటి?’ అని నోరు పారేసుకుని చిరంజీవికి, ఆయన ప్రతిష్ఠకు మరింత నష్టం చేస్తున్నారు. వారసత్వానికి మగా ఆడా అనే తేడాలుండవు, ఒకరు సంపాదించే ఆస్తులను కాకుండా వారు సమాజానికి చేసే మంచిని ముందుకు తీసుకుపోయేవారు సొంత బిడ్డలు కాకపోయినా వారసులే.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News