Friday, December 20, 2024

బోధన్ లో బైక్ పై ఎమ్మెల్సీ కవిత హల్ చల్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్నారు. దీంతో గురువారం రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. నామినేషన్లకు చివరి తేదీ రేపే(నవంబర్ 10, శుక్రవారం) కావడంతో అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు ఈరోజు వారి వారి నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఈ క్రమంలో బోధన్ లో ఎమ్మెల్సీ కవిత హల్ చల్ చేశారు. బోధన్ బిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత బైక్ పై వెళ్తూ సందడి చేశారు.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం నామినేషన్లు వేశారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసీఆర్ ఉదయం 11.06 గంటలకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్డీఓ బన్సీలాల్ కు అందజేశారు. మరికాసేపట్లో ఆయన నేరుగా కామారెడ్డికి వెళ్లి నామినేషన్ వేస్తారు. తర్వాత అక్కడే జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News