Saturday, December 21, 2024

కవిత చేతిలో కారు.. కార్యకర్తల్లో హుషారు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్: ఎంఎల్‌సి కవిత వినూత్న రీతిలో బిఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్‌ను నింపుతున్నారు. మొన్న షకీల్ నామినేషన్ వేస్తున్న సమయంలో ఓ సామాన్యురాలిగా మోటార్ సైకిల్‌పై ఎక్కి బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే విధంగా శుక్రవారం కూడా నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ నామినేషన్ సందర్భంగా కారును నడిపి సందడి చేశారు. బిగాల గణేష్‌ గుప్తకు ప్రతిసారి ఎన్నికల్లో సమయంలో తనకు కలిసివచ్చే అంబాసిడర్ కారులోనే ప్రతిసారి వెళ్లి నామినేషన్ వేయడం ఆయనకు ఆనవాయితీగా వస్తుంది.

గత రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో సమయంలో బిగాల గణేష్ అంబాసిడర్ కారులోనే వెళ్లి నామినేషన్ వేసి గెలుపొందారు. అసలే అంబాసిడర్ కారు ఆపై పింక్ రంగుతో పులుపుకొని ఉండటంతో ఆ పట్టణంలోనే ఆ కారుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే అదే కారును ఎంఎల్‌సి కవిత సైతం నడపటంతో స్థానికుల దృష్టి మొత్తంగా ఆ కారుపై పడింది. ఎంఎస్‌సి కవిత ఆ కారులో బిగాలను తీసుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం పట్టణంలో పలు వీధుల్లో చక్కర్లు కొట్టి కార్యకర్తల్లో జోష్‌ను నింపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News