Friday, November 8, 2024

ఎంఎల్‌సి కవితకు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవితకు బెయిల్ మంజూరైంది. ఇడి, సిబిఐ కేసుల్లో కవితకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్‌కు మూడు ప్రధానమైన కారణాలను కోర్టు తెలిపింది. తుది ఛార్జిషీట్‌ను సిబిఐ దాఖలు చేయగా ఇడి దర్యాప్తు పూర్తి చేసిందని వివరించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని, మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ఇడి, సిబిఐ కేసుల్లో పది లక్షల చొప్పున బాండ్లు సమర్పించాలని చెప్పింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మార్చి 15న ఎంఎల్‌సి కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ఐదు నెలలగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News