Sunday, December 22, 2024

కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత మధ్యంతర బెయిల్ పిటి షన్‌పై విచారణ వాయిదా వేసింది. తన చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ పై విచారణను ధర్మాసనం ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే గురు వారం రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా కోర్టులో కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కీలక వాదనలు వినిపించారు. కవితకు మధ్యంతర బెయిల్, రెగ్యూలర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేకున్నా అరెస్ట్ చేశారని మరోసారి గుర్తుచేశారు.

మొదటి, సప్లిమెంటరీ చార్జిషీట్‌లోనూ కవిత పేరు లేదన్నారు. అసలు ఆమె విచారణకు సహకరిస్తున్న ప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అరుణ్ పిళ్లై 9 సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని తెలిపారు. అనం తరం ఇడి కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు సింఘ్వి కోర్టును సమయం అడిగారు. ఈ నెల 3వ తేదీన క్లియర్‌గా సమాధానం చెబుతానన్నారు. మరోవైపు తీహార్ జైల్లో కవితకు ఇంటి భోజనం అందించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనంతో పాటు బుక్స్, పెన్నులు, పేపర్లు, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News