Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నగరంలోని ఎల్బీ స్టేడియంలో సిఎం కెసిఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కవిత భారీ కేక్‌ కట్‌చేసి సిఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సిఎం కెసిఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ కూడా సిఎం కెసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

MLC Kavitha Birth Day Wishes to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News