Monday, December 23, 2024

వీడియో: సముద్రపు అంచులలోకి వెళ్లి.. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళాఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.

నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. అటు ఎమ్మెల్సీ కవితకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News