Friday, April 4, 2025

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

- Advertisement -
- Advertisement -

సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు
టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టిన రోజును ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా జరుపుకున్నారని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని మహేశ్ బిగాల ఇచ్చిన పిలుపుమేరకు పలుచోట్ల వివిధ కార్యక్రమాలను ఎన్‌ఆర్‌ఐలు చేపట్టారు. వీరితో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణకు చెందిన యువకులు, ఐటి ఉద్యోగులు పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు పలుచోట్ల కేక్‌లను కట్ చేసి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఇలాంటి పుట్టినరోజులను మరిన్ని జరుపుకోవాలని, ఆమె మరిన్ని పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

MLC Kavitha Birthday Celebrations Richly Around the World

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News