Saturday, December 21, 2024

ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ ను అరెస్టు చేశారు. గతంలో గోరంట్ల బుచ్చిబాబు ఎమ్మెల్సీ కవిత వద్ద చార్డెట్ అకౌంటెంట్ గా పని చేశాడు. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉండడంతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు ఆయన సహాయం చేసినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలో బుచ్చిబాబును సిబిఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్టు సమాచారం. వైద్య పరీక్షలు చేసిన తరువాత బుచ్చిబాబును రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News