Wednesday, January 22, 2025

నన్ను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు.. కడిగిన ముత్యంలా బయటకొస్తా: కవిత

- Advertisement -
- Advertisement -

తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చునని.. కాని, కడిగిన ముత్యంలా బయటకొస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. లిక్కర్ కేసులో అరెస్టైన కవితను… 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇడి అధికారులు మంగళవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చారు.

కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో కవిత మాట్లాడుతూ.. “కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది తప్పుడు కేసు. నేను తప్పు చేయలేదు. అప్రూవర్ గా మారేది లేదు. నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కాని, మా ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బ తీయలేదరు. కానీ క్లీన్ గా బయటకు వస్తా. ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. ఒక నిందితుడు ఇప్పటికే బిజెపిలో చేరాడు. మరో నిందితుడు బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిజెపి రూ.50కోట్లు ఇచ్చాడు” అని ఆరోపించారు.

కవితను 14 రోజుల జూడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరారు ఇడి అధికారులు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేశారు. ఒకవేళ జుడీషియల్ రిమాండ్ కు కోర్టు అనుమతిస్తే.. కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News