Monday, February 3, 2025

బిసి కులగణనపై కాంగ్రెస్ వి కాకి లెక్కలు: కవిత

- Advertisement -
- Advertisement -

బిసి కులగణన నివేదికపై అనుమానం

కరీంనగర్ లో ఎమ్మెల్సీ కవిత

కరీంనగర్: బిసి కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కులగణన నివేదికపై సోమవారం కరీంనగర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో కోటి 15 లక్షల ఇళ్లు, జనాభా 3. 70 కోట్లు అని తేల్చిందని , అయితే దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బిసిలు ఉన్నట్లు తెలుస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చారని ఆరోపణలు చేశారు. బిసిలు 46 శాతం ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. కరెక్టే అయితే సర్వేలో తానిచ్చిన వివరాలు, తన పేరు ఆధార్ కార్డు కొడితే రావాలని చెప్పారు. సర్వే రిపోర్ట్ ను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలని కవిత డిమాండ్ చేశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిస్ అయిన వారి కోసం మళ్లీ అవకాశం ఇవ్వాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News