Monday, March 31, 2025

కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తా: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బిజెపిలో చేరారని, ఇంకొక్కరికి లోకసభ ఎన్నికలలో బిజెపి టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఇడి మంగళవారం తనను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు. అలాగే, మూడో నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బిజెపికి అందజేశారని ఆరోపణలు చేశారు. తనపై చట్టవిరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారని, న్యాయపోరాటం చేసి కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని కవిత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News