Friday, April 4, 2025

బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Comments on BJP Leaders

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చేరిగారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ నేతలను కవిత ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న సిఎం కెసిఅర్ రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని కవిత గుర్తుచేశారు. పంజాబ్,హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో వడ్లు 100శాతం కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి ఆమె డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై వన్‌ నేషన్ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఉండాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News