Sunday, February 2, 2025

8 మంది ఎంపిలు… నిధులు సున్నా: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు 8 మంది చొప్పున ఎంపిలు ఉన్నా సాధించిన నిధులు సున్నా అని చురకలంటించారు. ఆదివారం ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ పట్ల బిజెపికి చిత్తశుద్ధి లేదని, ఈ బడ్జెట్ తో తేటతెల్లమైందని విమర్శించారు. అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్ధతను మరోసారి నిరూపించుకుందని కవిత దుయ్యబట్టారు. దేశంలోని స్పైసెస్, టీ, రబ్బర్‌ బోర్డులకు బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించిందని, పసుపు బోర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని కవిత ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకొన్న బిజెపి ఎంపిలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News