తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రంలా కనిపిస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కెసిఆర్ ను ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో3ను వెనక్కి తీసుకోవాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేశారు. ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చునని చెప్పి.. మూడు రోజులు నాన్చి ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చారని కవిత ఆరోపించారు. ఇదేనా ప్రజా పాలన అంటే..? అని ఆమె ప్రశ్నించారు. ధర్నాకు హాజరయ్యేందుకు వస్తున్న ఆడబిడ్డలను అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోండని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- Advertisement -